ఇఫ్కో సెజ్‌లో రూ.10వేల కోట్లతో పరిశ్రమలు: ఎమ్మెల్యే
NLR: ఇఫ్కో కిసాన్ సెజ్‌లో రూ.10వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. శుక్రవారం కోవూరులోని 17,18 వార్డులలో ఆమె పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 30 ఏళ్లుగా కదలిక లేని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో కూటమి ప్రభుత్వం కదలికలు తెచ్చిందన్నారు. పరిశ్రమల ద్వారా యువతకు భారీగా ఉపాధి కలుగుతుందన్నారు.