యూరియా కోసం బారులు తీరిన రైతులు

MDK: చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. రెండు రోజులుగా మండలంలో యూరియా కొరత నెలకొంది. శుక్రవారం మడూర్ సహకార సంఘం వద్ద యూరియా అందుబాటులో ఉందని తెలుసుకున్న రైతులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఒక రైతుకు ఒక బస్తానే ఇస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.