చెరువుగట్టులో ప్రత్యేక పూజలు చేసిన చిరుమర్తి

చెరువుగట్టులో ప్రత్యేక పూజలు చేసిన చిరుమర్తి

NLG: నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకుల ఆహ్వానం మేరకు మొదటి రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించారు.