భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
SRCL: కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. రాజన్నకు మొక్కుకున్న కోడె మొక్కును భీమేశ్వరాలయంలో చెల్లించుకుంటున్నారు.