కౌలు రైతు కార్డులపై సమావేశం: తహసీల్దార్

KRNL: తుగ్గలి మండల రెవెన్యూ కార్యాలయంలో కౌలు రైతు కార్డులపై సమావేశాన్ని తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. కౌలు చేస్తున్న ప్రతి రైతు కౌలు కార్డులను గ్రామ రెవెన్యూ అధికారి వద్ద తీసుకోవాలని ఆమె సూచించారు. కౌలు కార్డు ఉంటేనే రైతుకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆమె తెలిపారు. ప్రతి సచివాలయంలో కౌలు రైతు కార్డు అవగాహన సదస్సులు జరుగుతాయని అన్నారు.