మియాపూర్ నుంచి ప్రత్యేక బస్సులు
RR: కార్తీకమాసం సందర్భంగా మియాపూర్-1 డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు DM మోహన్ రావు తెలిపారు. అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోటలోని ఐదు శివాలయాలను దర్శించడం జరుగుతుందని, ఈనెల 9న బస్సు బయలుదేరి తిరిగి 11న మియాపూర్‌కు చేరుకుంటుందన్నారు. ఆసక్తి గలవారు టీజీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.