భూసార పరీక్షలపై అవగాహన

NLR: మర్రిపాడు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో భూసార పరీక్షలపై ఏవో S. రామ్మోహన్ రైతులకు అవగాహన కల్పించారు. మట్టి నమూనాల సేకరణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి ప్రాముఖ్యత ఏంటనే దాని గురించి వివరించారు. ప్రతి రైతు గ్రామాల్లోని వ్యవసాయ సహాయకుల(VAA)ను సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.