నిలిచినపోయిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్
MBNR: సాంకేతిక లోపంతో తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ దేవరకద్ర రైల్వే స్టేషన్‌లో సుమారు గంటన్నర పాటు నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటలకు స్టేషన్‌కు చేరుకున్న రైలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు ప్లాట్‌పారమ్ పైనే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా రైల్వే సిబ్బంది సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రైలు తిరిగి ప్రయాణమైంది.