పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
KRNL: రూరల్ మండలం ఉల్చాల గ్రామంలో మంగళవారం 23 ఏళ్ల రఘువరన్ అనే ఐటీసీ మార్కెటింగ్ ఏజెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కంపెనీ లోన్ కలెక్షన్ డబ్బును చెల్లించకపోవడం వల్ల ఒత్తిడికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.