VIDEO: లారీ ఢీకొని 26 గొర్రెలు, గొర్రెల కాపరి మృతి

VIDEO: లారీ ఢీకొని 26 గొర్రెలు, గొర్రెల కాపరి మృతి

MBNR: జిల్లాకు చెందిన గొర్రెల కాపరులు కామారెడ్డి జిల్లాలో గొర్రెలను మేపడానికి వెళ్లగా, బుధవారం సాయంత్రం NH-44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెలను మేపుకుంటూ రహదారిపైకి వెళ్లిన వారిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో గొర్రెల కాపరితో పాటు 26 గొర్రెలు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.