అటవీ భూముల రక్షణకు తక్షణ సర్వే అవసరం: నంబూరి

KMM: సత్తుపల్లి మండలం గంగారంలోని సర్వే నంబర్లు 133, 131, 40లోని అటవీ భూములను రక్షించేందుకు తక్షణ సర్వే నిర్వహించాలని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు నేతృత్వంలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సర్వేలోని అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించాడని వివరించారు.