రామారెడ్డిలో ఘనంగా రథోత్సవం ఊరేగింపు

రామారెడ్డిలో ఘనంగా రథోత్సవం ఊరేగింపు

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం సీతారామ చంద్ర స్వామి, రాజరాజేశ్వర స్వామి వారి రథాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రథోత్సవం ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రథాన్ని లాగడానికి పోటిపడ్డారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.