'సరోగసి పేరిట సృష్టి ఫెర్టిలిటీ అరాచకాలు'

HYD: సరోగసి పేరిట చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బాగోతాలు బయటకు వచ్చాయి. ఢిల్లీకి చెందిన మహిళ వద్ద బిడ్డను కొనుగోలుచేసి, రాజస్థాన్‌కు చెందిన దంపతులకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహకులు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వివరాలు డీసీపీ సాధన రష్మీ తెలిపారు.