రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ది
విజయనగరం ఇరిగేషన్ డివిజన్ పరిధిలోని 109 మైనర్ ఇరిగేషన్ చెరువులను సుమారు రూ. 55 కోట్లతో అభివృద్ది చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. చిన్నతరహా నీటిపారుదల చెరువుల అభివృద్దిపై తమ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు.