రైల్వే డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి

NTR: విజయవాడ రైల్వే డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు MP కేశినేని శివనాథ్ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లో GM సంజయ్‌కుమార్‌ను కలసి లెవల్ క్రాసింగ్ నెం. 316, 147, 148, 8 వద్ద తక్షణం RoBs, RuBs నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరారు. అలాగే గేట్‌వే ఆఫ్ అమరావతిగా కొండపల్లి స్టేషన్‌ను అమృత్ భారత్ 2.0 కింద ఆధునీకరించాలని విజ్ఞప్తి చేశారు.