బస్టాండ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి
BHNR: చౌటుప్పల్ బస్టాండ్ ఎదురుగా ఓపెన్ ఫ్లైఓవర్ నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. జాతీయ రహదారి 65 విస్తరణలో భాగంగా కేవలం కొన్ని చోట్ల మాత్రమే బ్రిడ్జిలు కడితే బస్సులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిని, స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మించాలన్నారు.