ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

VZM: DCCB ఛైర్మన్‌గా బాద్యతలు చేపట్టిన కిమిడి నాగార్జునను ఆయన నివాసంలో గురువారం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. యువ నాయకుడిగా నాగార్జున పార్టీకి చేసిన కృషి అభినందనీయమని, ఆయన నేతృత్వంలో డీసీసీబీ రైతులకు మరింత చేరువయ్యేలా సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.