కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి పథకంలతో లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని నర్వ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నయ్య సాగర్, జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డిలు అన్నారు. మంగళవారం కన్మనూరు రైతు వేదిక దగ్గర లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ రామకోటి, గిర్దావరి సుధాకర్ రెడ్డీ, నాయకులు పాల్గొన్నారు.