VIDEO: టీటీడీ కళ్యాణ మండపం స్థలానికి విముక్తి
MNCL: రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూర్ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా మారిన టీటీడీ కళ్యాణ మండపం స్థలానికి విముక్తి లభించింది. TTD స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి సూచించడంతో మున్సిపల్ యంత్రాంగం రంగంలోకి దిగి ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. దీంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.