ఉప్పుటేరు వంతెనపై మత్యకారులు చేపల వేట

W.G: పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల మధ్య ఉన్న ఉప్పుటేరు వంతెనపై మత్య్సకారులు చేపలు వేటాడుతున్నారు. కొల్లేరు నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున చేపల వేట ముమ్మరంగా సాగుతోంది. కొల్లేరులో కొన్ని ప్రాంతాల్లో చెరువులు నీట మునగడంతో చేపలు ఉప్పుటేరులోనికి వస్తున్నాయి. రెండేసి కిలోల బరువున్న చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయని మత్యకారులు చెబుతున్నారు.