VIDEO: సొమ్మసిల్లి పడిపోయిన ఆర్టీసీ కార్మికుడు
కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొన్న రమేశ్ అనే కార్మికుడు అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రభుత్వం తమ ప్రాణాలతో చెలగాటమాడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు.