అదుపుతప్పి బైక్‌పై నుంచి పడి తండ్రి, కుమారుడికి గాయాలు

అదుపుతప్పి బైక్‌పై నుంచి పడి తండ్రి, కుమారుడికి గాయాలు

ప్రకాశం: పామూరు మండలం మచ్చుపొద గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులు కింద పడ్డారు. ఇరువురికి గాయాలు కాగా పామూరు ప్రభుత్వ వైద్యశాలకు 108లో తరలించారు. బోడవాడ గ్రామానికి చెందిన వేణుగోపాల్ తన భార్య కొడుకుతో పామూరు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. వేణుగోపాల్‌కు స్వల్ప గాయాలు కాగా కొడుకు కౌశిక్‌ తలకు గాయమైంది.