'విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'
KDP: మంగళవారం సాయంత్రం వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో 'పోలీస్ కళా-జాగృతి' బృందం 'ఓ యువతా మేలుకో’ పేరుతో అవగాహన నాటక ప్రదర్శన చేపట్టారు. అనంతరం వల్లూరు ఎస్సై పెద్ద ఓబన్నా మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.