కేజ్రీవాల్ శీష్ మహల్ 2.0పై మలివాల్ విమర్శలు
మాజీ సీఎం కేజ్రీవాల్ శీష్ మహల్ 2.0పై ఆప్ తిరుగుబాటు నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మండిపడ్డారు. కేజ్రీవాల్ పంజాబ్ సూపర్ సీఎంగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. పంజాబ్ పరిపాలన దాని ప్రస్తుత స్థితి, ఖర్చు, నివాసితులకు సంబంధించి పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి ఆదేశాల మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్‌ను అతిథి గృహంగా మార్చారని ప్రశ్నించారు.