అనారోగ్యంతో పంచాయతీ సెక్రటరీ మృతి

అనారోగ్యంతో పంచాయతీ సెక్రటరీ మృతి

W.G: పెనుమంట్ర గ్రామ పంచాయతీ గ్రేడ్‌-1 కార్యదర్శి మంచిరాజు సీతా రామారావు(57) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఖండవల్లి గ్రామానికి చెందిన ఆయన 30 సం.ల నుంచి పంచాయతీ రాజ్‌ సర్వీసులో పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మండలానికి పూర్తి స్థాయి ఈవోపీఆర్డీ పోస్ట్‌ ఖాళీగా ఉన్న కాలంలో ఆయన కొన్ని నెలలు ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు.