VIDEO: భారీ వర్షం.. రైతుల్లో కలవరం

VIDEO: భారీ వర్షం.. రైతుల్లో కలవరం

KDP: మదనపల్లెలో ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. మొంథా తుఫాను ప్రభావంతో టమాటా పంటకు తెగుళ్లు సోకి, రైతులు కాయలను పారబోయాల్సిన దుస్థితి ఏర్పడింది. మళ్లీ వర్షాలు కురిస్తే టమాటా, ఇతర కూరగాయలు, వరి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టం వల్ల అప్పుల పాలవుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.