జాతీయ రహదారిలో స్టాపర్‌లు ఏర్పాటు

జాతీయ రహదారిలో స్టాపర్‌లు ఏర్పాటు

VZM: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు డెంకాడ ఎస్సై ఏ.సన్యాసినాయుడు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జాతీయ రహదారిలో దూరం నుంచి వచ్చే వాహనాలకు కనబడేలా రేడియం స్టిక్కర్‌లు టైర్లకు అంటించి అధిక ప్రమాదాలు జరిగే రహదారుల్లో ఏర్పాటు చేశారు. దీంతో దూరం నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపు చేయవచ్చని చెప్పారు. ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.