పశువుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ
NGKL: కోడేరుకు చెందిన పోడేండ్ల కురుమయ్యకు ఈజీఎస్ ద్వారా పశువుల షెడ్డు మంజూరు అయ్యింది. ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. సర్పంచ్‌కు మాట్లాడుతూ.. పశు సంరక్షణకు పాడిరైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పాడిరైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాసయ్య పాల్గొన్నారు.