నాదెండ్ల తహశీల్దార్ బదిలీ

నాదెండ్ల తహశీల్దార్ బదిలీ

PLD: నాదెండ్ల తహసీల్దార్ ఎస్. చంద్రశేఖర్ అచ్చంపేటకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ తహసీల్దార్‌గా డిప్యూటీ తహశీల్దార్ షేక్ సల్మాన్‌కు బాధ్యతలు అప్పగించారు. నాలుగు నెలల క్రితమే వచ్చిన తహసీల్దార్ చంద్రశేఖర్, మండలంలోని పరిస్థితులతో రాజీపడలేకనే బదిలీ అయ్యారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.