పోలీసు సేవాదళ్ సేవలు భేష్..!

పోలీసు సేవాదళ్ సేవలు భేష్..!

VZM: మహాశివరాత్రి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు ఆదివారం వేకువజామున నుండి భక్తులతో పోటెత్తాయి. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో పలు ఆలయాల్లో పోలీసు సేవాదళ్ లను ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు నడవలేనివారు, వికలాంగులు, వృద్ధాప్య స్థితిలో ఉన్నవారు దర్శనాలకు పోలీసు సేవాదళ్ ఆలయం వరకు తీసుకు వెళ్తున్నారు.