యూత్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌కు పత్తిపాక యువకుడు

యూత్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌కు పత్తిపాక యువకుడు

PDPL: ధర్మారం మండలం పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు రేషవేణి రాకేష్ ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రా‌మ్‌కు ఎంపికయ్యారని వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్ తెలిపారు. ఈనెల 9 నుంచి 13 వరకు తమిళనాడు కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో రాకేష్ పాల్గొని మన ప్రాంత ప్రతిభను చాటనున్నారు. ఈ సందర్భంగా ఆయనను సర్పంచ్ శ్రావణి, యూత్ సభ్యులు అభినందించారు.