గాయపడిన కుష్టీ సర్పంచును పరామర్శించిన MLA
NRML: భైంసా RTC డిపో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిజామాబాద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కుష్టీ సర్పంచ్ గంగారంను ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి గంగారం ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు.