నాణ్యమైన విద్య మంచి భవిష్యత్తుకు పునాది: డిఈఓ

SRCL: బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ ను గురువారం జిల్లా విద్యాధికారి ఏ.రమేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా డిఇఓ తరగతి గదులలో ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ ప్రణాళికలు రూపొందించుకోవాలని మంచి విద్యను అందించాలని అన్నారు.