రోడ్ల మీద పారుతున్న డ్రైనేజీ

కృష్ణా: విజయవాడ సింగ్ నగర్ నందమూరి నగర్ సర్వీస్ రోడ్డు వద్ద డ్రైనేజీ మ్యాన్ హోల్ నుంచి రోడ్డు మీద కాలువలా నీరు పారుతుంది. సర్వీస్ రోడ్ల నుండి ఆర్‌యూబీలోకి డ్రైనేజీ వెళ్ళటంతో దుర్వాసనతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.