జాతీయ అండర్-19 జట్టుకు ఎంపికైన పాలకొల్లు సమీరుద్దీన్
W.G: పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన షేక్ సమీరుద్దీన్ అండర్-19 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 5వ తేదీ నుంచి హర్యానాలో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ జాతీయ క్రికెట్ పోటిల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. సమీరుద్దీన్ గతంలో ప. గో జిల్లా అండర్-17, ప్రస్తుతం అండర్-19 జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.