జిల్లాస్థాయి పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

KNR: వీణవంక మండలంలోని ఘన్ముకుల మోడల్ స్కూల్ విద్యార్థులు ఇటీవల జరిగిన SGF మండల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రతిభకనబర్చిన 30 మంది విద్యార్థులను జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మొయిజ్ బేగ్ తెలిపారు.