ఛలో భోరజ్ కార్యక్రమం జయప్రదం చేయండి.!
ADB: అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈనెల 21న నిర్వహించే ‘హలో రైతన్న చలో భోరజ్‘ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి అన్నారు. గురువారం సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అధిక వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పండించిన పత్తి పంటను డిసెంబర్ నెల చివరి వరకు కొనుగోలు చేయాలన్నారు.