పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
KNR: శంకరపట్నం మండలం గొల్లపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటయిన గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే 20 లక్షల వ్యయంతో ఈ పంచాయతీ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు.