శ్రీ మఠంలో ఘనంగా స్వర్ణ పల్లకోత్సవం

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో స్వర్ణ పల్లకోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు రాఘవేంద్రుని బృందావన ప్రతిమకు విశేష పూజలు నిర్వహించి, మంగళ హారతులు ఇచ్చిన అనంతరం బృందావన ప్రతిమను స్వర్ణ పల్లకిలో ఉంచి శ్రీ మఠం ప్రాకారంలో పల్లకోత్సవం నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ చేయించిన భక్తులకు ఫల మంత్రాక్షతలు అందజేసి ఆశీర్వదించారు.