VIDEO: అధికారుల గైర్హాజరుపై ఎంపీపీ ఆగ్రహం
NLR: సీతారామపురం ఎంపీడీవో ఆఫీస్లో ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. కొన్ని శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంతో ఎంపీపీ, ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. వేసవి కాలం దృష్ట్యా నీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఉపాధి హామీ ద్వారా పని కల్పిస్తూ పని చేసే చోట సేదదీరటానికి అనువుగా పరదాలు ఏర్పాటు చేయాలన్నారు.