సీఎం రేవంత్ మేడారం పర్యటన షెడ్యూల్
MLG: సీఎం రేవంత్ మేడారం పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. మంగళవారం ఉదయం 10:45 బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి 12 గంటలకు మేడారం చేరుకోనున్నారు. 12:15 నుంచి 12:30 మధ్య మేడారం దర్శనం, అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2:30కి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన, అనంతరం హెలికాప్టర్ ద్వారా 3:45కు బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు.