'మున్సిపల్ కోఆప్షన్ మెంబర్‌గా అవకాశం కల్పించాలి'

'మున్సిపల్ కోఆప్షన్ మెంబర్‌గా అవకాశం కల్పించాలి'

MBK: రామాయంపేట మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల నియామకంలో ఎస్సీ సామాజిక వర్గానికి ఒక సీటు కేటాయించాలని ఎంఆర్‌పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మల్యాల కిషన్ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. సామాజిక న్యాయం పాటించి, ఎస్సీలకు ప్రాతినిధ్యం కల్పించాలని విన్నవించారు. ఈ మేరకు తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.