అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ

సూర్యాపేట: తుంగతుర్తి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, అంగన్వాడి టీచర్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం పొడిశెట్టి నర్సయ్య మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటే దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, సహనానికి ప్రతిరూపం మహిళ అని, మహిళ హక్కుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.