రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: ఎస్. రాయవరం మండలంలో పలు గ్రామాలకు ఈనెల 4వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పెదగుమ్ములూరు, గోకులపాడు, రామయ్యపట్నం, నీలాద్రిపురం, చినగుమ్ములూరు,పెట్టుగోళ్లపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.