మొదటి విడత ఎన్నికలు.. మద్యం షాపులు బంద్
MLG: మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారంల్లోని మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు మూసివేశారు. ముడవ విడతల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రాంతాల్లో పోలింగ్ ముగిసే వరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, నిన్న సాయంత్రం 5 గంటల నుంచి మద్యం షాపులను మూసవేసింది.