నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GDWL: ధరూర్ మండలంలోని పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిసిపోతుందని అధికారులు శుక్రవారం తెలిపారు. ధరూర్, మన్నాపురం సబ్ స్టేషన్ల పరిధిలోని 33 కేవీ ఫీడర్‌పై మరమ్మతుల కారణంగా ఈ కోత జరుగుతుంది. ధరూర్, జాంపల్లి, దోర్నాల్, బురేడిపల్లి, మన్నాపురం, చిన్నిపాడు, పార్చెర్ల గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్  ఉండదన్నారు.