మాజీ సర్పంచ్‌పై గొడ్డలితో దాడి.. నిందితుడి అరెస్టు

మాజీ సర్పంచ్‌పై గొడ్డలితో దాడి.. నిందితుడి అరెస్టు

VZM: బొబ్బిలి మండలం మెట్టవలస మాజీ సర్పంచ్ మాధవపై హత్యాయత్నం కేసులో నిందితుడు ఇజ్జాడ అప్పారావును గురువారం రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పట్టణ సీఐ నారాయణరావు తెలిపారు. ఈనెల 14న గ్రామదేవత పండగ నిర్వహణ వివాదంలో మాధవ మందలించడంతో కక్షతో గొడ్డలితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.