VIDEO: కావలిని వణికిస్తున్న గ్రామ సింహాలు

VIDEO: కావలిని వణికిస్తున్న గ్రామ సింహాలు

NLR: కావలి పట్టణంలో వీధి కుక్కల బెడద పెరిగింది. ప్రతి వీధిలో పదుల సంఖ్యలో కుక్కలు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో ఇళ్లకు వెళ్లడమే కష్టంగా మారింది. బైకులపై వెళ్లేవారిని తరుముతూ, రోజూ కుక్క కాట్ల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.