'రైతులు మరింత విస్తీర్ణంలో చెరకు సాగు చేయాలి'
కృష్ణా: ఉయ్యూరులోని కేసీపీ చక్కెర కర్మాగారంలో 2025-26 సీజన్‌కు సంబంధించిన చెరకు క్రషింగ్‌ను గురువారం రాత్రి యూనిట్ హెడ్ యలమంచిలి సీతారామదాసు ప్రారంభించారు. ఈ సీజన్‌లో 3.20 లక్షల టన్నుల చెరకు గానుగ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులు మరింత విస్తీర్ణంలో చెరకు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సీజన్‌లో చెరకు టన్ను ధర రూ.3,690గా ఉంది.