విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి: కలెక్టర్

GDWL: విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం, అన్ని సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ బీ.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మల్దకల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు.